Pawanism Media

"పవన్" అంటే ఒక" నిజం" .. కలిపి చదివితే "పవనిజం " తన నిజమైన వ్యక్తిత్వమే ఇక్కడ ఆదర్శం తన మానవత్వమే ఇక్కడి మార్గంమనం ఇక్కడ ఏం చేస్తున్నాం ...మన పవనుడి పై ప్రేమ ను చూపిస్తాం తన ఫొటోస్ పెడతాం..తన గురించి ఏదైనా రాస్తాం అంటే మన ప్రేమ ఇంతవరకే పరిమితమా ...ఇంకేం చేయలేమా.... చేయగలం ..ఆలోచించండి ..మన ప్రేమ తో సమాజానికి ఏదైనా మంచి చేద్దాం ..మన ప్రేమకి ఉన్న పవర్ ఏంటో చూపిద్దాం ....ఒక పూట అన్నం తినకపోతే విలవిల లాడే ప్రాణం మనది..అలాంటి జీవితాలు ఎన్నో, సమయానికి తిండి లేక ..తోటి మనుషుల ఆదరణ కరువై ప్రతి క్షణం ప్రాణం కోసం పోరాడుతున్నాయి..ప్రతి రోజు కంటతడి పెడుతున్నాయి ..సాయం కోసం ఆశతో ఎదురు చూస్తున్నాయి ...తప్పు ఎవరిదో తెలియదు కాని ప్రాణాలు పోతున్నాయి ...తల్లి ప్రేమ దూరమై పసి ప్రాణాలు తల్లడిల్లుతున్నాయి ఆకలి ని తీర్చుకోవడానికి తప్పుదారులు పడుతున్నాయి ఎన్నో జీవితాలు ఇలా బలి అవుతున్నాయి ..
ఒక మనిషి బాధ ఇంకొక మనిషే కదా అర్థం చేసుకోగలడు అందుకే ... మన ప్రేమ ,అభిమానాలకి నిస్వార్థాన్ని చేరుద్దాం మానవత్వం అనే దారిలో పయనిద్దాం అనాధలని, ఆపదలో ఉన్న మనుషులని మన పవనిజం అనే సమాజంలోకి ఆహ్వానిద్దాం పవనిజం అనే ఆశ్రయాన్ని కల్పిద్దాంఅనాధే ఇక్కడి తల్లి..అనాధే ఇక్కడి తండ్రి అనాధలే ఇక్కడి బిడ్డలు ..రండి బయలుదేరుదాం అనాధ అంటే "అందరి నేస్తం " అనే అర్థాన్ని తెద్దాం వారికి ఆత్మీయులుగా ఉందాంపవనిజం అంటే పవనుడి అభిమానులకే కాదు అందరికోసం నిలిచి ఉంటుంది అని నిరూపిద్దాం మనమే ఇక్కడ హీరోలమౌదాం ...మన పవనిజం లోని పరమార్థాన్ని లోకానికి తెలియచేద్దాం ...మీరు సిద్దమేనా...అయితే ముందుకు రండి ..మనమేంటో ...మన పవనిజం లోని ప్రేమకున్న పవర్ ఏంటో చూపిద్దాం ...ఆలోచించండి .... ఏంచేద్దాం... ఎలాచేద్దాం అనేది మీరే చెప్పండి ...............