శ్రీ కృష్ణ లక్ష్మీ దేవరమ్మ తల్లి దేవస్థానం, కవిపురం, పెడన మండలం!!
Goddess in Kavipuram
శ్రీ కృష్ణ లక్ష్మీ దేవరమ్మ తల్లి దేవస్థానం, కవిపురం, పెడన మండలం!!
Goddess in Kavipuram
కృష్ణా జిల్లా పెడన మండలం కవిపురం గ్రామంలో కటకం వారింట కొలువు తీరిన కొంగు బంగారు తల్లి “శ్రీ శ్రీ శ్రీ కృష్ణ లక్ష్మీ దేవరమ్మ తల్లి”..!!!
శ్రీ అమ్మవారి స్వప్న ఆదేసానుసారం శ్రీ అమ్మవారి పురాతన(శిధిలావస్థ) ఆలయమును తొలగించి అదే ప్రాంతంలో నూతన ఆలయమును నిర్మించదలచి ది.04-03-2018 ఆదివారం ఉదయం 10:30 లకు శ్రీ మధుసూదన రావు మరియు శ్రీమతి సుబ్బమ్మ దంపతులచే ఆలయ పునఃనిర్మాణమునకు శంఖుస్థాపన కార్యక్రమం జరిగినది.
ది.02-05-2018 బుధవారం నాడు ఉదయం 7:18లకు శ్రీ అమ్మవారి పునఃప్రతిష్ఠా కార్యక్రమం అట్టహాసంగా జరిగినది. ఆ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 2 వేల మంది భక్తులకు మహా అన్నసమారాధనా కార్యక్రమం జరిగినది.
ఆ తదుపరి 04-05-2018 శుక్రవారం నుంచి 06-05-2018 ఆదివారం వరకూ శ్రీ శ్రీ శ్రీ కృష్ణ లక్ష్మీ దేవరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు - 2018 అత్యంత వైభవోపేతంగా జరిగినవి.!!
అప్పటి నుంచి ప్రతి సంవత్సరం శ్రీ అమ్మవారికి వార్షిక జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నవి..
శ్రీ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం, ప్రతి పౌర్ణమి మరియు అన్నీ హిందూ పర్వదినాలలో శ్రీ దేవరమ్మ భజనా బృందం వారిచే భజనా కార్యక్రమాలు మరియు లలితా & విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు జరుగును..!!
ప్రతి శ్రావణ మరియు కార్తీక మాసములలో శ్రీ అమ్మవారి కోవెల యందు విశేష పూజా కార్యక్రమాలు వ్రతాలు నిర్వహించబడును..!!