Sridhar Nallamothu
Hyderabad
Sridhar Nallamothu
Hyderabad
నా లక్ష్యం ఒక్కటే.. క్లిష్టతరమైన టెక్నాలజీని సామాన్య తెలుగు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం! అదే లక్ష్యంతో గత 15 సంవత్సరాలకు పైగా కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేస్తూ, టివి ప్రోగ్రాములు, రేడియో ఫోన్-ఇన్ ప్రోగ్రాములూ, MCA, B-Tech విద్యార్థులకు కాలేజ్ సెమినార్లూ, రీడర్స్ మీటింగులూ, వెబినార్లూ, ఆన్లైన్ ఛాట్, ఫోరమ్, బ్లాగ్, వందలకొద్దీ టెక్నికల్ వీడియోలూ.. ఇలా రకరకాల మార్గాల ద్వారా పనిచేసుకుంటూ వెళుతున్నాను. In one word.. I am living my life with clear vision and dedicated work. ఇక నా గురించి వివరాలివి: 1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్‌హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్‌హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్‌కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ TV9, I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, HM TV, MAHAA TV, Zee 24 గంటలు, జెమిని న్యూస్, సాక్షి టివి, Studio N, NTV, Jagruthi వంటి ఛానెళ్లలో 220కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన 1000కి పైగా పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ ట��క్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గా http://computerera.co.in/blog ప్రత్యేకతను సంతరించుకుంది. http://computerera.co.in సైట్ ని పూర్తి స్థాయి వీడియో పోర్టల్ గానూ రూపొందించడం జరిగింది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 540కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 21,000 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్