sri kaluvagaddasrianjaneyaswami

Anjaneya Swamy Temple in kothacheruvu

కాలవగట్టు/కాలువగడ్డ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పుట్టపర్తి సమీపంలోని కొత్తచెరువు పట్టణంలో ఉంది. ఇది అతి పురాతన దేవాలయం. ముఖ్యంగా ఈ స్వామి విగ్రహానికి 3 అడుగులతో ఉన్న ఈ విగ్రహానికి ప్రత్యేకత ఉంది. మధ్వ తేగా వేదాంత ప్రధాన ఆచార్య పరమహంస . శ్రీ వ్యాస రాయ/ వ్యాస రాజ హనుమంతుడిని దైవిక శక్తితో ప్రతిష్టించారు. స్వామివారి తల సంప్రదాయ ఉత్తరం వైపు ముఖం తిప్పినట్లు కనిపిస్తుంది. నవంబరు 25, 1905న మధ్వ తేగా కు చెందిన బ్రహ్మచారి శ్రీ బేలూరి వేంకటేశ్వరాచార్యులు ఈ స్వామిని వెలుగులోకి తెచ్చి దీపారాధన నైవేద్య వ్యవహారాలు చూసేవారు. కొన్ని పండ్ల చెట్లు పెట్టి మరియు పొంగలి ,స్వామి వారి కి నైవేద్యం చేస్తుండేవారు . పండ్లు మరియు పొంగలి కొన్ని వానరాలు(కోతులు) కు పెటేవాడు . ప్రక్కన కాలవ ఉంది. అంతకుముందు కంప చెట్లు శిథిలావస్థలో ఉన్న దేవస్థాన వేంకటేశ్వరాచర్యులు వారు ఒక పద్దతి ప్రకారం తేవడం జరిగింది . వారి నిర్యాణం తర్వాత ఈ ఆలయాన్ని పట్టించుకునే వారు లేక చాలా సంవత్సరాలు పూజలు చేయలేదు. 1968 సంవత్సరంలో స్థానిక ఆర్చకులు భాస్కర వంశస్థులు వారు చుస్తుండేవారు అక్కడికి వెళ్ళి పూజ దీపారాధ చేస్తుండేవారు. కొంతమంది భక్తులు , ఊరి పెద్దలు .సహకారంతో 1986 సంవత్సరం నుంచి ఆలయం అభివృద్ధి చెందుతు వస్తుంది . అప్పుడప్పుడు ఈ స్వామి కి ఒక దేవతా సర్పం వస్తుంటుంది ఈ స్వామి ధర్మించేందుకు అని స్థానికలు చెబుతుంటారు కాలువగట్టు కాలక్రమేణా కాలువగడ్డ అనే పేరు ఏర్పడింది.