Vaartha Dharpanam
Web Developer, Editor, and Mother in Paravada
జనసేన నాయకుల అరెస్టు అప్రజాస్వామికం
- గొన్న రమాదేవి
పరవాడ; అధికార పార్టీ ఎంపీ రియల్ భవనాల నిర్మాణం కోసం ప్రజలు ఇబ్బంది పడేలా రహదారిని మూసి వేయడాన్ని నిరసిస్తూ విశాఖలోని టైకూన్ హోటల్ కూడలి వద్ద జనసేన నాయకులు చేపట్టిన నిరసనలో ఆ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేసిన తీరును పెందుర్తి జనసేన పార్టీ నాయకురాలు గొన్న రమాదేవి ఖండిరచారు. ఇది పూర్తిగా ఆప్రజాస్వామికమని మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో కనీసం నిరసన తెలుపుకునే స్వేచ్చను కూడా ఈ వైసీపీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. వైసీపీ రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న జనసేన పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. భవిష్యత్తులో తమకు ఎలాగూ అధికారం దక్కదన్న ఉద్దేశంతోనే ఆ పార్టీ నాయకులు ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు దిగుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రజలంతా సిద్దంగా ఉన్నారని, అధికార పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలన్నిటిని ప్రజలు గమనిస్తున్నారని రమాదేవి పేర్కొన్నారు.