Abhilasha Back
Hyderabad, Andhra Pradesh
మరణం ఎవరి హోదాను చూడదు. మరణం ఎవరి అధికారాన్ని చూడదు. మరణం ఎవరి పలుకుబడిని చూడదు. మరణం ఎవరి మతాన్ని చూడదు. మరణం చిన్న పెద్ద అని చూడదు. మరణముకు జాలి దయ కరుణ లేదు. మరణానికి దేవునికి చాలా దగ్గర పోలికలున్నాయి. దేవుడు జాలి, దయ, కరుణ లేని వాడు కాబట్టే భగవద్గీతలో ఎవరు నువ్వు అన్న ప్రశ్నకు దేవుడు జవాబుగా కాలమును నేను అన్నాడు. కాలం అంటే నాశనం. ఈ కాలంలో ఎవ్వరైనా నాశనం అవ్వక తప్పదు. అందుకే ఓ జీవా! కాలంలో బ్రతుకుతున్న మనకు ఈ మతాల కీచులాటలెందుకు, అధికార దాహాలెందుకు. మరణం మనకు ఏనాటికైనా తప్పదు అని తెలిసి మేలుకో.......మత్తు వదులుకో.......