యలమంచిలి గిరీష్ దత్త్ చౌదరి
Edupugallu
యలమంచిలి గిరీష్ దత్త్ చౌదరి
Edupugallu
1988, అక్టోబర్, 20, విజయదశమి రోజు మా అమ్మ గారెలు వేస్తుంటే నేనొస్తా అంటూ బూమిమీద అడుగేసా.. చిన్నపట్నుంచి ఇల్లె నా ప్రపంచం, చదువు మొదలుపెట్టాక బడి నాకు మరో కొత్త ప్రపంచం.
నాకున్న బలం మా "అన్నయ్య( ఖన్నా)", నా భయం "నేను".. ఎవరితోను అంత సులువుగా కలవలేను, నా తీరు వైవిద్యం, నా సైలి నిర్మొహమాటం. చదువులు అంతా ఆంగ్ల మాద్యమంలోనే అయినప్పట్టికి, మాత్రు బాష తెలుగు మీద మమకారంతొ ఆ బాషనే ఎక్కువగా ఉపయోగిస్తూ, ఇష్తపడుతూ పెరిగాను..
ఒకసారి మాకు తెలుగు పాటాలలొ ఒక ప్రముక గాయకుని జీవిత కద ఉంది, అది పూర్తైనాక అప్పటి మా తెలుగు ఉపాద్యయురాలుగారు మా తరగతి వాల్లతో అన్నారు, అందరిలోను ఎదో ఒక నైపున్యం ఉండి తీరుతుంది, మీలొ ఏముందొ మీరె తెలుసుకొవాలి, వారంలొ ఎదో ఒకటి ప్రత్యేకముగ చేసి చూపడానికి ప్రయత్నించండి అన్నారు. అంతే ఇక నాలొ ఎమి ఉందో అనుకుంటూ చిత్రాలు వెద్దామని ప్రయత్నించాను కాని కుదరలేదు, ఇంకా మరెన్నొ ప్రయత్నించినప్పటికి ఎవీ కూడా పరిపూర్నంగా కుదరలేదు, అప్పుడు నాకు ఒక ఆలొచన వచ్చింది, నేను ఎమైనా సొంతగా కవిత్వాలు వ్రాయగలనేమో అని.. అంతే ఒక కవిత రాసి తీసుకువెళ్ళా, అది మా ఉపాద్యాయురాలు గారికి నచ్చింది..
అలా మొదలైంది నా రచనల పర్వం.... ఇప్పటివరకు పలు కవితలతో పాటు కొన్ని పాటలు కుడా రాసాను, వాటితోపాటు కదలు ఎన్నో రాసాను ఇప్పటికి ఒక నవల పూర్తయినా, ఏది కూడా ప్రచూరించలేదు, కనీసం ఎవరికి చూపలేదు కుడా... ప్రస్తుతం రెండో నవల వ్రాస్తున్నాను...అవన్నీ నేను అంతగా దాచడం వెనక ఒక పెద్ద కారనమే ఉన్నది...